బీహార్‌లో కాంగ్రెస్ కూటమికి MIM షాక్
NEWS Oct 13,2025 08:17 pm
బీహార్‌లో మళ్లీ కాంగ్రెస్ కూటమికి షాక్ ఇవ్వడానికి ఎంఐఎం సిద్ధమైంది. పార్టీ 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, గట్టి పోటీకి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్ సింఘియా ప్రాంతంలో లిస్టును ప్రకటించింది. పార్టీ ఆర్జేడీతో పొత్తు ప్రతిపాదనలు విఫలమై, స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించింది. సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను ప్రాధాన్యం ఇచ్చి, మహిళలకు గౌరవ ప్రదమైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది సీమాంచల్ ప్రాంతాన్ని మద్దతు బేస్‌గా మార్చే ప్రయత్నం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.