భూయాజమానులతో సమానంగా రుణాలు
NEWS Oct 13,2025 08:18 pm
జిల్లాలో కౌలు రైతులు కూడా భూమి యజమానులతో సమానంగా పంట రుణాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 7వ జిల్లా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ (DCDC) సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రైతులకు రుణాల మంజూరులో ఎదురవుతున్న అడ్డంకులు, భూముల మార్టిగేజ్ ప్రక్రియ, కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలను సమీక్షించారు. కౌలు రైతులకు సకాలంలో పంట రుణాలు అందేలా సహకార సంస్థలు, బ్యాంకులు సమన్వయంగా పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.