విశాఖలో గూగుల్ ఏఐ హబ్..!
NEWS Oct 13,2025 07:41 pm
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగంలో చారిత్రాత్మక ఘట్టం. టెక్ దిగ్గజం గూగుల్, విశాఖలో ₹87,250 కోట్లతో “గూగుల్ ఏఐ హబ్”ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన MOU మంగళవారం ఢిల్లీలో గూగుల్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖ దేశంలో తొలి AI నగరంగా రూపాంతరం చెందనుంది. సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతో పాటు రాష్ట్ర GSDPకి భారీ ఊతం లభించనుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.