అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రం కె రాంప్
NEWS Oct 13,2025 07:46 pm
అన్ని హంగులు, వినోదాలతో నిండి ఉన్న చిత్రంగా ‘కె-రాంప్’ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ఆద్యంతం వేగంగా నడుస్తుందని, అందుకే దీనికి ‘రాంప్’ అనే పేరు పెట్టామని చెప్పారు. హాస్య మూవీస్ పతాకంపై జైన్స్ నాని దర్శకత్వంలోని ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మించారు. ‘కె-రాంప్’ ఈ నెల 18న దీపావళి కానుకగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ భాగంగా రాజమండ్రిలోని హోటల్ షెల్టన్లో మీడియాతో మాట్లాడిన కిరణ్ అబ్బవరం, సినిమా టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందిందని తెలిపారు.