ప్రధానిని కలిసిన సీఎం చంద్రబాబు
NEWS Oct 13,2025 06:55 pm
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలిశారు. విశాఖలో ₹86 వేల కోట్లతో గూగుల్ AI ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని ప్రధానికి వివరించారు. ఈ MOU మంగళవారం ఢిల్లీలో కుదురనున్నట్లు తెలిపారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతంపై కేంద్ర సహాయం కోరారు. అక్టోబర్ 16న కర్నూలులో జీఎస్టీ 2.0 రోడ్‌షోకు, నవంబర్‌లో విశాఖ పెట్టుబడుల సదస్సుకు ప్రధానిని ఆహ్వానించారు.