డీఎస్సీ ఉపాధ్యాయుల బాధ్యతల స్వీకారం
NEWS Oct 13,2025 07:14 pm
మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో భాగంగా చిట్వేల్ మండలంలోని పాఠశాలల్లో 25 మంది ఎస్జీటీలు, ఒక ఉర్దూ టీచర్, 7 మంది పిఎస్ హెచ్ఎంలు సోమవారం విధుల్లో చేరారు. ఎంఈఓ ఈశ్వరయ్య జాయినింగ్ రిపోర్టులు స్వీకరించి, “విద్యార్థుల భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో, విలువలతో బోధించాలి” అని సూచించారు. సీనియర్ ఉపాధ్యాయులు కొత్త టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు.