కొండగట్టు అంజన్న ఆదాయం ఎంతంటే..
NEWS Oct 13,2025 07:11 pm
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో 81 రోజుల హుండీల లెక్కింపులో రూ.1,08,72,591 నగదు, 55 విదేశీ కరెన్సీలు లభించాయి. ఈ లెక్కింపును కార్యనిర్వాహణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ వేంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ వారు సోమవారం నిర్వహించారు. వచ్చిన బంగారం, వెండిని సీల్ చేసి హుండీలోనే భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ రాజమొగిలి, ప్రధాన అర్చకులు, పర్యవేక్షకులు, పోలీసు, బ్యాంకు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.