ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ నూతన మేనేజ్‌మెంట్ కమిటీ ఏర్పాటు కోసం అక్టోబర్ 15న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి సభ్యుల జాబితా ఇంకా అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కీర్తి చేకూరి తెలిపారు. తదుపరి సమావేశ తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు ఆమె వెల్లడించారు.