కొత్త ఉపాధ్యాయులు బాధ్యతల స్వీకారం
NEWS Oct 13,2025 01:28 pm
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని పినకోట స్కూల్ క్యాంప్లెక్స్ పరిధిలో మొత్తం 8 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి నియమించారు. పినకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. సోంబాబు తెలిపారు. ఇటీవల మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన అభ్యర్థులు సోమవారం తమ తమ పాఠశాలల్లో విధుల్లో చేరారు. పినకోట, పెదకోట, కివర్ల, జీనబాడు పంచాయతీల పరిధిలోని దయార్తి, పొడెల్తీ, బొంగిజ, వెలమామిడి, పాటిపల్లి పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాధ్యతలు స్వీకరించారు.