సీఎం ప్రవేశపెట్టిన “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” దార్శనిక కార్యక్రమం ప్రకారం పట్టణ ప్రాంత పేద కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్ (MEPMA) ఆధ్వర్యంలో జీవనోపాధి ప్రమోషన్ కార్యక్రమాలు సక్రమంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.