స్మృతి మంధాన సిక్స్‌ప్యాక్ ఫొటో ఫేక్
NEWS Oct 13,2025 03:34 pm
టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు సిక్స్ ప్యాక్ ఉందని ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ సెషన్‌లో టీషర్ట్ పైకెత్తినట్లు కనిపించే ఆ ఫోటోలో ఆమె ఆబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది నిజం కాదు. ఆ ఫోటో ఏఐ లేదా ఎడిటింగ్ ద్వారా తయారైనదని ఎక్స్ ఏఐ ప్లాట్‌ఫామ్ గ్రోక్ స్పష్టం చేసింది. స్మృతి మంధాన స్వయంగా ఆ ఫోటో ఎక్కడా షేర్ చేయలేదని వెల్లడైంది. ఇదిలా ఉండగా, మహిళా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 80 పరుగులతో స్మృతి అద్భుత ప్రదర్శన చేసింది.