బంగారం.. ప్రతి రోజూ ఆల్‌టైం హై!
NEWS Oct 13,2025 03:28 pm
బంగారం, వెండి ఆకాశాన్ని తాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,28,110గా ఉంది. అదే 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర ₹1,18,630గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ₹ 1,83,000కి చేరింది. 2025లో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగానే ధరలు పెరిగాయి. 2026 ప్రారంభం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1.50 వేలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.