నకిలీ మద్యంపై వైసీపీ ఆందోళన
NEWS Oct 13,2025 09:28 am
రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి వేణుగోపాల్, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. నకిలీ మద్యం అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు రామాలయం జంక్షన్ లో వైసీపీ మహిళ నాయకులు చంద్రబాబు చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేస్తారు.