గ్రామ సమస్యలపై కాంతాయచారి ఫైర్
NEWS Oct 13,2025 09:18 am
మల్లాపూర్: కొత్తదామరాజుపల్లిలో తాగునీటి సమస్యపై బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాంతాయ చారి మండిపడ్డారు. వారం రోజులుగా ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పాటు మోటార్ కాలిపోయి 8 రోజులుగా సమస్య కొనసాగుతుందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లేని దుస్థితి నెలకొని ఉందని, అధికారులు గ్రామాల పర్యటన చేయకుండానే ఆఫీసుల్లో నుంచే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కాంతాయ చారి డిమాండ్ చేశారు.