సీపీ సజ్జనార్ సరికొత్త ఛాలెంజ్
NEWS Oct 13,2025 01:48 pm
హైదరాబాద్: పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు సేఫ్‌రైడ్ ఛాలెంజ్ ప్రారంభించారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ పెట్టుకోవడం వంటి భద్రతా చర్యలతో వీడియో లేదా ఫోటో తీసి ముగ్గురు స్నేహితులను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. యువతలో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాటు పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు. “సేఫ్టీ ఎప్పుడూ ఫ్యాషన్ అవుట్ కాదు, 2025లో సేఫ్టీని కూలెస్ట్ ట్రెండ్‌గా మార్చుదాం” అని సజ్జనార్ అన్నారు.