క్రీడాకారిణికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
NEWS Oct 13,2025 01:32 pm
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడాకారిణికి ఆర్థిక సహాయం అందించారు. రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదువుతున్న 40వ డివిజన్‌కు చెందిన సున్నం భార్గవి రాష్ట్ర స్థాయి మహిళా క్రికెట్ పోటీలకు ఎంపికైంది. బౌలింగ్‌లో ప్రతిభ కనబరుస్తున్న భార్గవి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, కాళ్లకు సరైన షూ కూడా లేని పరిస్థితి ఉందని స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంటనే ఒక జత షూ అందించడంతో పాటు, ఆమెకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారా అందిస్తామని ప్రకటించారు.