విధి వెక్కిరించింది.. చిరు'గుండె' ఆగింది
NEWS Oct 13,2025 10:09 am
అనురాగం, ఆప్యాయతల నడుమ అల్లారుముద్దుగా పెరగాల్సిన పసివాడు విగ్నేష్ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పుట్టుకతోనే గుండె సమస్య తలెత్తింది. నకిరేకల్‌కు చెందిన తల్లిదండ్రులు కరుణాకర్ - సోనీ తమ చిన్నారికి నిమ్స్‌లో సర్జరీ చేయించారు. రక్తదాతలు సాయం చేశారు. కానీ విధి వక్రికరించింది. సర్జరీ అయిన 3 రోజుల్లోనే చిన్నారి కన్నుమూశాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.