నూతన ఉపాధ్యాయులకు ఘన స్వాగతం
NEWS Oct 13,2025 10:06 am
చిట్వేల్: మెగా డీఎస్సీ–25లో ఎంపికై చిట్వేల్ మండలంలో బాధ్యతలు స్వీకరించిన నూతన ఉపాధ్యాయులను విద్యా వర్గాలు, స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతించారు. “చదువును అందించడం కేవలం ఉద్యోగం కాదు, అది బాధ్యతతో కూడిన పుణ్యకార్యం” అంటూ ఉపాధ్యాయులను ప్రోత్సహించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో నిబద్ధతతో పనిచేయాలని ఆకాంక్షిస్తూ, నూతన ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.