బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్.కృష్ణయ్య
NEWS Oct 12,2025 04:17 pm
HYD: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఏర్పాటు చేశారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆర్.కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీ నారగోని వ్యవహరించనున్నారు. బీసీ జేఏసీలో ముఖ్యమైన ఆరుగురితో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. “బీసీలకు న్యాయం కోసం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చాం. చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం’’ అని కృష్ణయ్య చెప్పారు.