యువ ప్రతిభకు పోలీసుల అభినందనలు
NEWS Oct 12,2025 10:43 pm
కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన దొంగనోట్ల కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించిన నేపథ్యంపై ఒక ఊహాజనిత యానిమేటెడ్ వీడియో రూపొందించిన ధీరన్‌ని పోలీసులు అభినందించారు. Dot Creation స్టార్టప్ స్థాపించిన ధీరన్ బోగి, యానిమేటెడ్ వీడియోను రూపొందించాడు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి SP క్యాంప్ కార్యాలయంలో ధీరన్ బోగిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ – “యువతలో ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు ఎంతో ప్రోత్సాహకరం. సామాజిక అవగాహన కలిగించేలా ఇలాంటి క్రియేటివ్ ప్రయత్నాలు మరింత పెరగాలి. పోలీసు శాఖ ఎల్లప్పుడూ యువత ప్రతిభను ప్రోత్సహిస్తుంది” అని అన్నారు. ధీరన్ బోగి రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. స్థానిక యువతకు ఇది స్ఫూర్తిదాయకంగా మారింది.