అల్లు అర్జున్ రికార్డు స్థాయి రెమ్యునరేషన్!
NEWS Oct 12,2025 06:38 pm
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోనున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. అట్లీ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న AA22 కోసం ఆయన ఏకంగా రూ.175 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభాస్ కొన్ని సినిమాలకు రూ.150 కోట్లు తీసుకున్నారని చెప్పాయి. దీంతో రాబోయే సినిమాలతో ఐకాన్ స్టార్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.