సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆహ్వానం
NEWS Oct 12,2025 06:29 pm
సైనిక్ స్కూళ్ల 2026-27 సంవత్సరానికి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE) ద్వారా ప్రవేశాలు జరుగుతాయి. 6, 9 తరగతుల్లో చేరేందుకు జనవరి 4, 2026న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులు అక్టోబర్ 21, 2025 నుంచి నవంబర్ 20 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అర్హత కోసం వయస్సు, విద్యార్హతలు తనిఖీ చేయాలి. మొత్తం 33 సైనిక్ స్కూళ్లు, 40 ఆమోదిత న్యూ సైనిక్ స్కూళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు exams.nta.ac.in/AISSEE వెబ్‌సైట్‌ను సందర్శించాలి.