హైదరాబాద్‌లో అరుదైన పక్షి!
NEWS Oct 12,2025 04:37 pm
గడ్డి కంకులపై వాలి, గింజలు తింటూ కిలకిలా రావాలతో సందడి చేస్తున్న ఈ పక్షులు గచ్చిబౌలి ISB రోడ్డులో కెమెరాకు చిక్కాయి. వాటిని ‘చుక్కల మునియ పిట్ట’ లేదా ‘చుక్కల జునువాయి’ అని పిలుస్తారు. ‘ఇది ఎస్ట్రిల్లిడే కుటుంబానికి చెందిన ఫించ్ పిట్ట. ఆసియా ఖండంలోనే కన్పిస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు 11 జాతులు ఉనికిలో ఉన్నాయి. లేత గడ్డి చివుళ్లు, గడ్డి విత్తనాలు, పళ్లు, చిన్న కీటకాలు వీటి ఆహారం. వరి మడులలో సాధారణంగా కనిపిస్తాయి. వెదురు ఆకులతో డోమ్ ఆకారంలో గూళ్లు నిర్మించుకుంటాయి’ అని అసోసియేట్ ప్రొఫెసర్ రవీందర్‌రావు తెలిపారు.