వావ్.. ఏఐ 'షూ'లు వచ్చాయ్!
NEWS Oct 12,2025 04:27 pm
మార్కెట్‌లోకి ఏఐ టెక్నాలజీతో రూపొందిన కొత్త షూలు వచ్చాయి. ఫిట్‌నెస్‌కే కాదు, భద్రతా, ఆరోగ్య పరిరక్షణకూ ఉపయోగపడతాయి. మొబైల్ యాప్‌తో అనుసంధానమై పాదాల కదలికను గుర్తించి దూరం, సమయం, కేలరీలు లెక్కిస్తాయి. కెమెరాను కాలి కదలికలతో ఆపరేట్ చేయవచ్చు. ప్రమాదంలో పడి స్పందన లేకపోతే ఎస్‌వోఎస్ ద్వారా లొకేషన్ షేర్ అవుతుంది. సంగీతం, రాత్రిపూట లైట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పనిచేస్తాయి. ధర రూ.10–12 వేల మధ్యగా ఉంటుందని అజంతా కంపెనీ తెలిపింది.