విశాఖలో టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్
NEWS Oct 12,2025 04:10 pm
విశాఖపట్నం: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని ఒక గ్యాలరీకి, ఒక గేటుకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టారు. మంత్రి నారా లోకేశ్, ఐసీసీ చైర్మన్ జై షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ పేరును స్టేడియంలోని ‘ఏ-గ్యాలరీ’కి నామకరణం చేశారు.