సీఎంగా 15 ఏళ్ల మార్కును అధిగమించిన చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన విజన్, సుపరిపాలన పట్ల ఉన్న నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా కొనసాగేలా చేస్తున్నాయని కొనియాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఏపీ సంక్షేమం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్న ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.