మోదీతో రామ్‌చరణ్ దంపతులు భేటీ!
NEWS Oct 11,2025 09:16 pm
ప్రపంచవ్యాప్తంగా విలువిద్య వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తొలిసారిగా 'ఆర్చరీ ప్రీమియర్ లీగ్' (APL)ను లాంచ్ చేశారు. ఇటీవల ఢిల్లీలో చరణ్ స్వయంగా ప్రారంభించారు. మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి. లీగ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అనిల్ కామినేనితో కలిసి చరణ్, ఉపాసన ప్రధానిని కలుసుకున్నారు. లీగ్ విజయవంతం కావడానికి గల కారణాలను, భవిష్యత్తులో ఆర్చరీ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందించారు.