జాగృతిలో చేరనున్న 300 మంది ఆటో కార్మికులు
NEWS Oct 11,2025 10:45 pm
కామారెడ్డిలో జరిగిన మీడియా సమావేశంలో బజరంగ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్, బిఎంఎస్ జేఏసీ ఆటో యూనియన్‌కు చెందిన సుమారు 300 మంది సభ్యులు త్వరలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ సమక్షంలో జాగృతిలో చేరబోతున్నట్లు షేక్ అల్తాఫ్, సురేందర్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు.