భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ కార్యాలయంలో టీఎస్‌యుటిఎఫ్ సీనియర్ నాయకుడు అమరజీవి నాగటి నారాయణ తృతీయ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు. నాగటి నారాయణ ఉపాధ్యాయ ఉద్యమంలో చూపిన త్యాగం, నాయకత్వం నేటి ఉపాధ్యాయ తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.