సుప్రీంకోర్టు వాట్సాప్ కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ ఖాతా బ్లాక్ చేయడం, పునరుద్ధరణ కోరుతూ ఒక వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పాలీ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేస్తూ, క్లయింట్లతో కమ్యూనికేట్ చేస్తున్నారు. ధర్మాసనం మాట్లాడుతూ.. వాట్సాప్ యాక్సెస్ ప్రాథమిక హక్కు కాదు. ఇతర యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్వదేశీ 'అరట్టై' యాప్ వాడుకోండి. 'మేక్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహించండి అని సూచించింది.