పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా మణుగూరు సీఐపై మండిపడ్డారు. ఇసుక ర్యాంపు దొంగలకు సహకరిస్తున్న మణుగూరు సిఐపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఈనెల 11వ తేదీ ఉదయం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తానన్నారు. ఇసుక అక్రమార్కులు రైతులపై దాడి చేయడం ఏమిటని మండిపడ్డారు.