నోబెల్ ప్రైజ్ గెలిస్తే ఎన్ని కోట్లు ఇస్తారు?
NEWS Oct 10,2025 10:55 pm
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ బహుమతి గెలిచిన వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారన్న అంశంపై చర్చ మొదలైంది. నోబెల్ శాంతి బహుమతి విజేతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (దాదాపు రూ.10.25 కోట్లు) ప్రైజ్ మనీ, పతకం ఇస్తారు. మరోవైపు ట్రంప్‌కు నోబెల్ ఇవ్వకపోవడంపై కమిటీ వివరణ ఇచ్చింది. ఆయన పేరిట వచ్చిన నామినేషన్లు అన్నీ గడువు (జనవరి 31) ముగిశాక వచ్చినవేనని స్పష్టం చేసింది.