చినప్పన్నపాలెంలో చెత్త సేకరణపై అవగాహన
NEWS Oct 10,2025 11:05 pm
తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన ఉండాలని బుచ్చయ్య పేట చినప్పన్నపాలెంలో చెత్త సేకరణపై అవగాహన డిప్యూటీ ఎంపీడీవో ఎంవీఎస్ లవరాజు తెలిపారు. చినప్పన్నపాలెంలో సర్పంచ్ కోవెల ఈశ్వరరావు ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. ప్రజలు పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం లభిస్తుందన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా నిర్దేశిత ప్రదేశాల్లో వేయాలన్నారు.