ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి మరియా కొరీనా మచాడోను వరించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం కోసం ట్రంప్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా.. అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గుచూపారు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారు.