ట్రంప్‌కు అ'శాంతి' నింపిన నోబెల్
NEWS Oct 10,2025 05:15 pm
‘ఇంకా నేను ఎన్ని యుద్ధాలు ఆపాలి? ఇంకా ఏం చేయాలి?’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనసులో నిట్టూర్పు విడిచారేమో! ఎంతో ఆశతో ఎదురుచూసిన నోబెల్ శాంతి బహుమతి ఈసారి కూడా అందకపోవడంతో ఆయన నిరాశకు గురైనట్లు అనిపిస్తోంది. ట్రంప్ ఈ నిరాశను ఎలా వ్యక్తం చేస్తారో, ఏ దేశంపై లేదా ఏ విషయంపై వ్యాఖ్యల రూపంలో విరుచుకుపడతారో అనే ఆందోళన చర్చ మొదలైంది. ఈసారి దక్కకపోయినా, వచ్చే ఏడాది నోబెల్ గెలుచుకోవడానికి కొత్త రాజకీయ చతురతలు ప్రదర్శిస్తారేమోనన్న చర్చ జోరుగా సాగుతోంది.