జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక సమితి ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ నుంచి పాత బస్టాండ్ వరకు పాదయాత్రగా వచ్చి, జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం మెట్‌పల్లి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఆందోళన కారణంగా రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.