ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చారిత్రక 'గాజా శాంతి ప్రణాళిక' విజయంపై ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతికి కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో సాధించిన మంచి పురోగతిని కూడా ఇరువురు నేతలు సమీక్షించారు. రాబోయే వారాల్లో కూడా సన్నిహితంగా ఉండేందుకు అంగీకరించినట్లు మోదీ X ద్వారా వెల్లడించారు.