'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి గత జూలైలో వెండి ధరలు అసాధారణంగా పెరగనున్నాయని జోస్యం చెప్పారు. ప్రస్తుతం వెండి ధరలు తక్కువగా ఉన్నాయని, అవి మరింత పెరగకముందే కొనేయాలని పెట్టుబడిదారులకు X ద్వారా సూచించారు. బంగారం కంటే వెండి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని, అందువల్ల వెండిని కొనుగోలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ద్రవ్యోల్బణం పెరిగే సమయంలో వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమని కియోసాకి అభిప్రాయపడ్డారు.