TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. GO-9పై హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు. దీంతో హైకోర్టులో పోరాడడం, స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లడమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి.