తెలంగాణ కాంగ్రెస్ - పరీక్ష కాలం
NEWS Oct 09,2025 08:54 pm
BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం చేసి, దీనిపై స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించింది. నోటిఫికేషన్ రావడంతో గెలుపే లక్ష్యంగా క్యాడరూ సన్నద్ధమైంది. తీరా రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో క్యాడర్‌ను ఒక్కసారిగా నిరాశ ఆవహించింది. ప్రత్యర్థి పార్టీలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో, సొంత పార్టీ శ్రేణులకు ఏం చెప్పాలో, ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాలో అనే విషయాలు ఇప్పుడు పార్టీకి సవాళ్లుగా మారాయి.