డ్రగ్స్‌పై అవగాహన కల్పించిన ఎస్సై నగేష్
NEWS Oct 09,2025 10:05 pm
మాదక ద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయని, వాటి నుంచి దూరంగా ఉండాలని యువతకు మణుగూరు ఎస్సై నగేష్ సూచించారు. మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిలో చాలా మంది కుటుంబాలు, భవిష్యత్తు కోల్పోతున్నారని హెచ్చరించారు. యువత సమాజ అభివృద్ధికి మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.