TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆర్.కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చారు. బీసీల నోటికాడి ముద్దను లాగేశారని ఆర్.కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే తమకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. రేపటి బంద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.