బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం ముందు 3 అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 1. హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది. 2. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లడం. 3. హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ 4 వారాలు వేచి చూడటం.