ఆర్డీవో ఆఫీసు సామాగ్రిని జప్తు
NEWS Oct 09,2025 04:23 pm
జగిత్యాల: రైల్వే లైన్ కోసం 23 ఏళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న భూములకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దపల్లి– నిజామాబాద్ రైల్వే లైన్ కోసం తీసుకున్న భూములపై సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రైతులకు ఎకరాకు 10–15 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం విస్మరించడంతో గురువారం కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామాగ్రిని జప్తు చేశారు.