'జియో ఏఐ క్లాస్‌రూమ్' ఉచిత కోర్సు
NEWS Oct 09,2025 02:03 pm
విద్యార్థుల్లో ఏఐ పరిజ్ఞానం కోసం 'జియో ఏఐ క్లాస్‌రూమ్' పేరుతో ఫ్రీ ఫౌండేషన్ కోర్సును ప్రారంభించింది. జియో ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి రూపొందించిన ఈ కోర్సును జియోపీసీ ద్వారా పీసీలు, ల్యాప్‌టాప్‌లు, జియో సెట్-టాప్ బాక్సుల హెల్ప్‌తో స్మార్ట్ టీవీల్లో యాక్సెస్ చేయవచ్చు. 4 వారాల్లో ఏఐ ప్రాథమిక అంశాలు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి విషయాలపై శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి డిజిటల్ బ్యాడ్జ్‌తో పాటు, జియోపీసీ యూజర్లకు జియో ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ అందిస్తారు. ఈ కోర్స్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే http://www.jio.com/selfcare/interest/ai-classroom అనే వెబ్‌సైట్‌కి వెళ్లాలి.