యువత ధూమపానానికి దూరంగా ఉండాలి: డాక్టర్ దుర్గాభవాని
NEWS Oct 09,2025 02:22 pm
యువత ధూమపానానికి దూరంగా ఉండాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దుర్గ భవాని, డాక్టర్ మధు సూచించారు. పినపాక మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 3.0 నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా టొబాకో వల్ల నష్టాలపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం టొబాకో వాడటం వల్ల వచ్చే నష్టాలను వివరించారు. క్యాన్సర్ కు కారణం అవుతుందని, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.