అధికారులతో జడ్పీ సీఈవో సమావేశం
NEWS Oct 09,2025 02:21 pm
స్థానిక సంస్థల ఎన్నికలకు దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో పినపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జెడ్పి సీఈవో చంద్రశేఖర్ పరిశీలించారు. పినపాక మండలం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఎంపీడీవో సునీల్ కుమార్ ను అడిగి పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.