హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచే నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 23న పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉండనుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 11న నామినేషన్లకు చివరి తేదీ. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉండగా.. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.