ప్రధాని మోదీ స్వదేశీ మంత్రం!
NEWS Oct 08,2025 11:09 pm
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రజలను ‘స్వదేశీ’ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువుల వినియోగం దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తూ, యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు దేశానికి మేలు చేశాయని, నవరాత్రుల్లో భారీ అమ్మకాలు దానికి నిదర్శనమన్నారు. అలాగే, 2008 ముంబై దాడులపై యూపీఏ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం దేశ భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటుందని మోదీ స్పష్టం చేశారు.