USA: దీపావళికి అరుదైన గౌరవం
NEWS Oct 08,2025 10:34 pm
అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలో దీపావళికి అరుదైన గౌరవం దక్కింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ “అసెంబ్లీ బిల్ 268”పై సంతకం చేస్తూ దీపావళిని రాష్ట్ర ప్రత్యేక దినంగా ప్రకటించారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థల సిబ్బంది దీపావళి రోజున వేతనంతో కూడిన సెలవు పొందుతారు. విద్యాసంస్థల్లో దీపావళి ప్రాముఖ్యతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అనుమతి ఉంది. ఈ చట్టం దక్షిణాసియా వాసుల సాంస్కృతిక వారసత్వానికి గుర్తింపుగా భావించబడుతోంది.